The honest politician Dr.Bezawada Gopala Reddy|నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం డా.బెజవాడ గోపాలరెడ్డి

KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs

Kategorien:

#KiranPrabha #BezawadaGopalaReddy #AndhraPolitics Bezawada Gopala Reddy (5 August 1907 – 9 March 1997) was an Indian politician. He was Chief Minister of the erstwhile Andhra State (28 March 1955 – 1 November 1956) and Governor of Uttar Pradesh (1 May 1967 – 1 July 1972). He is best know for his honest and clean political life. He retired from politics at the age of 65 years and never looked back at any political event. He dedicated his last 25 years to literary activities. He published around 25 of his own writings. KiranPrabha narrates most interesting anecdotes from the highly inspiring life of Dr. Bezawada Gopala Reddy. 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ రాజకీయాలు చెయ్యలేదు. రాజకీయపదవులంటే ప్రజాసేవకే అని మనసావాచా నమ్మి అలాగే కొనసాగారు. పదవులు ఆయనవద్దకే వచ్చాయి తప్ప ఎప్పుడూ పదవులకోసం పాకులాడలేదు, పైరవీలు చెయ్యలేదు. ఏ పదవిలో ఉన్నా హాయిగా ఒక్కరే ఎక్కడికైనా కారులో వెళ్లగలిగిన, వెళ్ళిన మలినమెరుగని రాజకీయనాయకుడు. 30 ఏళ్ళకే మంత్రిపదవిని పొందిన తొలి అతిపిన్న వయస్కుడు. ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. ఆయన హయాం లోనే నాగార్జునసాగర్ కి పునాది పడింది. హైదరాబాదులో రవీంద్రభారతి, పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పడ్డంలో కీలకమైన పాత్రపోషించారు. 65 ఏళ్ళ వయసులో స్వచ్ఛందంగా రాజకీయాలనుంచి విరమించుకుని, ఆ తరువాత 25 సంవత్సరాల పాటు సాహితీలోకంలో సంచరించి 90 ఏళ్ళవయసులో కన్నుమూసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి డా.బెజవాడ గోపాలరెడ్డిగారు.