Multi talented poet Chandala Kesavadasu | తొలి తెలుగు సినీ గీత రచయిత | శ్రీ చందాల కేశవదాసు
KiranPrabha Telugu Talk Shows - Ein Podcast von kiranprabha - Mittwochs
Kategorien:
#kiranprabha #telugucinema #telugupoetry ఆయన వేదవేదాంగాలు పారాయణం చెయ్యలేదు, సంస్కృతం పాఠాలు నేర్చుకోలేదు, అసలు స్కూలుకెళ్ళిన చదువే లేదు, 30 సంవత్సరాల వరకూ రచయితే కాదు.. ఐనా స్వయంకృషితో సహజకవిగా ఎదిగారు, బహుముఖ ప్రజ్ఞత్వాన్ని ప్రదర్శించారు. ఆయనొక కవి, హరికథా భాగవతార్, నాటక రచయిత, సినీ రచయిత, నటుడు, మూడు దశబ్దాలు పైగా భాగవత సప్తాహ నిర్వాహకుడు , ఆయుర్వేద వైద్యుడు.. అన్నింటికీ మించి అసలు సిసలు మానవతావాది..! ఆయనే తొలి తెలుగు సినీ గీత రచయిత శ్రీ చందాల కేశవదాసు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఆయన జీవన రేఖలు ఈ టాక్ షోలో వినండి..